తాజా వార్తలు   భీమవరంలో వైసిపి పార్టీ బిసిల సమావేశం లో కీలకాంశాలు.. | కేంద్ర రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ పటేల్‌ రాజీనామా | భారత్ అజేయం..అగ్ని5 క్షిపణి విజయవంతం | ఎన్డీఏ ప్రభుత్వానికి షాక్..మంత్రి కుష్వాహా రాజీనామా | కృష్ణ జలాలు..ఆంధ్రప్రదేశ్ కు సుప్రీం కోర్టులో తిరస్కరణ | మోడీ,యోగి లపై సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు | ఘోర రోడ్డు ప్రమాదం: 11మంది దుర్మరణం | రాజస్తాన్ కాంగ్రెస్ దేనా? మరి సీఎం ఎవరంటే.. | టీఆర్‌ఎస్‌ కు అవసరమైతే బీజేపీ మద్దతు ఇచ్చితీరుతాం.. | నిశ్శబ్ద విప్లవం తో తీర్పు..11న విజయోత్సవాలు..KTR |

భీమవరం, మాజీ MP మెంటే పద్మనాభం ఇక లేరు..

Updated: January 3, 2017

సిగ్మాతెలుగు డాట్ కం, న్యూస్: నేడు, భీమవరం లో మాజీ రాజ్యసభ సభ్యుడు మెంటే పద్మనాభం  అనారోగ్యముతో నేటి ఉదయం మరణించారు. ఆయన గతం తెలుగుదేశం పార్టీ లో స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో, ఆయన ఆస్థాన మేధావిగా  కీలక భూమిక పోషించారు. నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు, దానికి నిరసనగా రాష్ట్రంలోనే ప్రధమంగా తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించి, రాజ్యసభ సభ్యునిగా తన మేధస్సు ను ఎన్టీఆర్ నేషనల్ ప్రాంట్ కు అందించి అప్పటి ఇందిరా, కాంగ్రెస్ ప్రబుత్వానికి, తదుపరి రాజీవ్ ప్రభుత్వానికి దీటుగా ఢిల్లీలో, ప్రతిపక్ష ఎంపీలతో  మంత్రాంగం నడపడంలో ఎన్టీఆర్ కు సహకరించిన మేధావి మెంటే పద్మనాభం తరువాత ఆయనను విభేదించి కాంగ్రెస్ లో చేరి పాలకొల్లు ఎం ఎల్ ఏ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోవడంతో ఆయన ఎదుగుదలకు బ్రేక్ పడింది. అయినప్పటికీ  భీమవరం లో కేజీఆర్ కళాశాల అడ్జక్షునిగా విద్య రంగానికి ఎనలేనిసేవ చేసారు. ఆధునిక ప్రమాణాలతో మెంటే పద్మనాభం ఇంజనీర్రింగ్ కలశాల ను ప్రారంభించారు.రైతు పక్షపాతిగా అనేక పోరాటాలలో ముందు నిలుచున్నారు. కొల్లేరు  సరస్సుకు పునర్ వైభవం రావడానికి, అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తో కల్సి పనిచేయడం కూడా జరిగింది. చంద్రబాబుతో కూడా మంచి ఇంటి మసి ఉన్న వ్యక్తిగా, పేరొందారు. భీమవరం అర్బన్ బ్యాంకు కు  చైర్మనుగా పనిచేయడం జరిగింది.  ఆయనకు ఉన్న రాజకీయ పలుకుబడి, రాష్ట్ర్ర గవర్నర్ కావలసిన వ్యక్తిగా,ఆ అవకాశం కూడా కొద్దిలో తప్పిపోయిందని సన్నిహితులు భావిస్తారు.. వయస్సు మీద పడటంతో , అనారోగ్యముతో గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఆయన నేడు తుది శ్వాసను విడవటంతో భీమవరం ప్రజానీకం ఒక రాజకీయ పితామహుడిని కోల్పోయినట్లయింది. ప్రముఖులు సంతాపం తెలుపగా ,  కాలేజ్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి.

 
 

Related Stories