తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

విజయవాడలో దేవాలయాల కూల్చివేత టీడీపీ,బీజేపీ పార్టీల మధ్య అగ్గి రాజేసింది

Updated: July 3, 2016

సిగ్మాతెలుగు డాట్ కం న్యూస్: విజయవాడలో దేవాలయాల కూల్చివేత టీడీపీ,బీజేపీ పార్టీల మధ్య అగ్గి రాజేసింది. ఈ రోజు బీజేపీ నేతలు సోము వీరాజు, కన్నా లక్ష్మి నారాయణ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తల ధర్నా కార్యక్రమము ను,అనంతరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఇంటి ఎదురుగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి, చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల విస్తరణ పేరు తో తనవారి ఆస్తులను కాపాడుతూ, దేవాలయాలను కూల్చివేస్తూ దేవుడి విగ్రహాలను ద్వంసమ్ చేయడం హిందువుల మనోభావాలను దెబ్బ తీయడాన్ని తాము సహించమని ప్రకటించడంతో, బుద్ధ వెంకన్న టీడీపీ కార్యకర్తలతో అక్కడికి వచ్చి ఆందోళనచేసి, వారికి అడ్డు తగలటం తో ఉద్రిక్తత వాతావరణం నెలకుంది, తదుపరి విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లడుతూ, బీజేపీ నేతలు రాజకీయం చేయడం మానుకోవాలని, రాష్ట్రానికి నిధులు తేవడం కోసం ప్రధానిని ఒపించలేని వారు అభివృద్ధిని అడ్డుకోవడమేమిటని ప్రశినించారు. నరసాపురం ఎంపీ గంగరాజుకు విజయవాడతో ఏమిటి పని అని ఎద్దెవా చేశారు. ఏది ఏమైనా బీజేపీ పార్టీ తో పాటు విశ్వహిందూ పరిషత్ శ్రేణులు ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టాలలేవు. ప్రభుత్వం తరుపున దీనిపై కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటన వచ్చింది. దేనిలో బీజేపీ మంత్రులు మాణిక్యాలరావుకు, కామినేని చోటు కలిపించారు.

 
 

Related Stories