తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

ఢిల్లీలో విశాఖ ఉక్కు ప్రేవేటీకరణ నిరసనలో వైసిపి ఎంపీలు

Updated: August 2, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి తమ నిరసన తెలిసేలా.. నేడు, సోమవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ వర్షం కురుస్తున్నప్పటికీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ధర్నాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ ధర్నాలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా కార్మిక సంఘాలతో పాటు  వైఎస్సార్సీపీ ఎంపీ లు కూడా ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి  మాట్లాడుతూ.. ‘‘స్టీల్‌ ప్లాంట్‌ కోసం 23 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌లో 1991లో ఉత్పాదన ప్రారంభమైంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కెపాసిటీ 7.3 మిలియన్‌ టన్నులు. లాభాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం తగదు. దురుద్దేశపూర్వకంగానే స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోంది.. దశాబ్దం పాటు పోరాటం చేసి స్టీల్‌ ప్లాంట్‌ సాధించుకున్నాం. ఎన్నో త్యాగాలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు జరిగింది. కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలను స్టీల్‌ప్లాంట్ కాపాడింది. రూ.22 వేల కోట్ల అప్పులను ఈక్విటీగా మార్చాలి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలి.’’ అని ​డిమాండ్ చేసారు. 
 
 
 

Related Stories