తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

ఏపీలో రిజిస్ట్రేషన్ల పక్రియ చాలా వేగంగా..కొత్త టెక్నాలజీ

Updated: August 2, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ,రిజిస్ట్రేషన్ల శాఖ ఆద్వర్యంలోని 295 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలన్నిటిలో  కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. ప్రజలకు మరింత వేగంగా,నాణ్యంగా డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్‌ సేవలు అందించడమే లక్ష్యంగా పలు మార్పులు శరవేగంగా చేస్తున్నామని అధికారులు అంటున్నారు. ఇటీవలేతెలుగు రాష్ట్రాల డేటా సర్వర్‌ విభజనను పూర్తిచేసి.. హైదరాబాద్‌ నుంచి మంగళగిరిలోని ‘పై డేటా సెంటర్‌’కు తరలించారు. అక్కడ ఏపీ సెంట్రల్‌ సర్వర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.  అలాగే గతంలో తహశీల్దార్‌ కార్యాలయాల నుంచి సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాలు డేటా సెంటర్‌కు అనుసంధానమై ఉండేవి. దీనివల్ల జాప్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా మార్చి నేరుగా డేటా సెంటర్‌కు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను అనుసంధానించనున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో గతంలో ఉన్న ఒరాకిల్‌ సాప్ట్‌వేర్‌ ను తొలగించి  కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను జావా సాఫ్ట్‌వేర్‌కి మార్చనున్నారు. రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో జరిగే జాప్యం చాలా వరకు తగ్గుతుందని భావిస్తున్నారు.కంప్యూటర్ల నెట్‌వర్క్‌ స్పీడ్‌ 4 ఎంబీపీఎస్‌ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే రూ. 12 కోట్లతో డిజిటల్‌ సర్వర్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 

 
 

Related Stories