తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

భీమవరంలో డా.యల్లాప్రగడ..స్మారక సత్కారాలు

Updated: August 1, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం స్థానిక కిరాణా మర్చంట్ అసోసియేషన్ భవనంలో నేడు, ఆదివారం  డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు స్మారక కరోనా ఐసోలేషన్ కేంద్రంలో విశిష్ట సేవలందించిన 40 మందిని అభినందించి సత్కరించారు. భీమవరంలో పుట్టి  ఎన్నో మహమ్మారి రోగాలకు వాక్సిన్లు కనిపెట్టి  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు  సేవకు స్ఫూర్తి దాత అని, వారి స్ఫూర్తితో  సేవా చేయడం ఒక వరమని పలువురు అన్నారు.  ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సత్కార సభలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షులు కనుమూరి సత్యనారాయణ రాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, రంగ సాయి,  కేంద్ర నిర్వాహకులు బి బలరాం, వేగిరాజు రాధాకృష్ణంరాజు, గోపాలన్  తదితరులు  మాట్లాడుతూ..  డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు హెల్త్ డెస్క్ కరోనా సమయంలో అందించిన సేవలు వెలకట్టలేనివని, వారి సేవలు అభినందనీయమని అన్నారు. గత 3 నెలలుగా దాతలు కేంద్రం ప్రారంభం నుంచి సంపూర్ణంగా సహకరించారని, వారితోపాటు డాక్టర్లు సత్యనంధం, సందీప్ వర్మలు విశేష సేవలు అందించారని,అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. 

 
 

Related Stories