తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

భీమవరంలో గతానికి భిన్నంగా ఉగాది రోజు..ఎలా గడుస్తుందంటే..?

Updated: March 27, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నేడు, బుధవారం ఉగాది పర్వదినం నేపథ్యంలో కరోనా వైరస్ భయంతో  గతానికి పూర్తీ బిన్నంగా భీమవరం పట్టణంలో ప్రజలు తమ తమ గృహాలలో నే తమ తమ  ఇష్ట దైవాలకు పూజలు చేస్తూ ఉగాది పచ్చడి తో ఉన్నంత లో పిండివంటలు చేసుకొని కుటుంబ  సమేతంగా హాయిగా బయటకు వెళ్లకుండా పండుగ చేసుకొంటున్నారు. ప్రముఖ దేవాలయాలు  తెరవక పోవడం ఉగాది పంచాంగ శ్రవణాలు జరగకపోవడం , స్వచ్చంద సంస్థలు, స్థానిక మున్సిపాలిటీ ఆవరణలో జరిగే ఉగాది వేడుకలు నిర్వహించకపోవడం పెద్ద లోటుగా ఉన్నపటికే.. ఎదో మాయచేసినట్లు ఈ ఉగాది ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులను ఏకంగా బాగా దగ్గర చేసిందని చెప్పవచ్చు.. అయితే మధ్య తరగతి , పేద ప్రజలు, వ్యాపారస్తుల ఆలోచనలలో మరో 21 రోజులు కరోనా తో ఆరోగ్య  భయం ఉన్నపటికీ, చేతిలో ఉన్న కొద్దీ ఆదాయంతో ఎలాబ్రతకాలి? రెంట్స్ ఎలా కట్టాలి ? అన్న భయాలు వెంటాడుతున్నాయి.  ప్రభుత్వ పెద్దలు పైకి ఎన్ని చెబుతున్న రోజు రోజుకు నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరల దోపిడీ నిస్సందేహంగా పెరిగింది.  నేడు, బుధవారం రోజు మరింత పెరిగింది. ఉదాహరణకు చిన్న మామిడికాయ 20 రూపాయలు, మూలగకాయ 10 రూపాయలు, ఉల్లి పాయ కేజీ 50 రూ.ఏ  ఆకుకూర కట్టయిన10 రూపాయలకు ధరలు పైకి పాకాయి. రేపు మరింత పెరుగుతాయేమోనని జనం నేటి ఉదయం ప్రజలు  పోలీసులు ఎంతగా అడ్డుకొంటున్నప్పటికీ మార్కెట్లోకి ఎక్కువగా వచ్చి కొనుగోలు చెయ్యడం జరిగింది.అక్కడికి పోలీసుల చొరవ వల్ల జనం గుంపులు కావడం మాత్రం జరగలేదు.  పాపం పండుగ రోజు కూడా పోలీసులు, మునిసిపల్ పారిశుధ్య పనివారు తమ విధులను, సేవలను మరింత శ్రద్దగా కొనసాగిస్తూనే ఉన్నారు.  

 
 

Related Stories