తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

మరో 21 రోజులు దేశం అంతటా లాక్ డౌన్ .. మోడీ సంచలన ప్రకటన

Updated: March 24, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్ దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై నేటి మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..ఈరోజు అర్థరాత్రి నుంచి దేశం మొత్తాన్ని సంపూర్ణంగా లాక్ డౌన్  (మూసివేస్తున్నట్లు)  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ సంపూర్ణ మూసివేత 21 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరై ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.  కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని ఆయన అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తామని , ప్రాణాలు తెగించి ఎప్పటికప్పుడు సమాచారని అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేస్తున్న మీడియా ప్రతినిదులు వారి సేవలను ప్రశంసిస్తున్నానని  మోదీ అన్నారు.

 
 

Related Stories