తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

భీమవరంలో ఇబ్బందులు,దోపిడీ లేకుండా..లాక్ డౌన్..MLA గ్రంధి శ్రీనివాస్..

Updated: March 24, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నేడు, మంగళవారం భీమవరం ఎం ఎల్ ఏ గ్రంధి శ్రీనివాస్ స్థానిక వన్ టౌన్ , టూ టౌన్, రురల్ పోలీస్  సీఐ లతోను, ఎం ఆర్ ఓ, మునిసిపల్ కమిషనర్ తోనూ కరోనా నేపథ్యంలో స్థానిక నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ ఏవిధంగా అమలు అవుతుంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిష్కారించే మార్గాలపై సమీక్షలు నిర్వహించిన తదుపరి తాజా నిర్ణయాలు ప్రకటించారు. గ్రంధి  శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజలు ఇళ్ళనుండి బయటకు రాకుండా చక్కటి సహకారం అందిస్తున్నారని, అలాగే మునిసిపల్ స్టాఫ్ , డాక్టర్స్ , పోలీస్ , ప్రభుత్వ సిబ్బంది నిబద్దతతో  కూడా తమ విధులను, ప్రజా సేవలను నిర్వర్తిస్తున్నారని వారికీ కృతఙ్ఞతలు తెలిపారు. ఇకపై ప్రజలు ఇబ్బందులు పడకుండా  స్థానిక డైలీ కూరగాయల మార్కెట్ ను పూర్తిగా తెరచి ఉంచుతామని , దీనివల్ల ఒకేసారి జనం రావడం , వైరస్ ప్రమాదం పొంచి ఉండటం, తప్పుతుందని, నిత్యావసర సరుకులు, కూరగాయలు ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని,అటువంటివారిపై  చర్యలకు అధికారులను, పోలీసులను ఆదేశించానని ,అలాగే రైతులకు, ఆక్వా రైతులకు  కావలసిన పురుగు మందులు, ఆక్సిజెన్ మరలు వంటివి కొనుగోలుకు ఆ షాపులు కూడా తెరచి ఉంటాయని , తప్పని సరి  వివాహాలు జరుపుకొనే వారు 10 మంది లోపే ఉండాలని, భారీ విందులు నిషేధం అమలు అవుతుందని, పండ్ల దుకాణం దారుణాలు నష్టపోకుండా వారి సరుకు అయ్యేవరకు అమ్ముకోవచ్చునని, కొత్తగా దిగుమతులు చేసుకోకూడదని, ఆక్వా ఎగుమతులు, చెరువుల పెట్టుబడులు కోసం కలెక్టర్ అనుమతి తో నిర్వహించాలని, దీనికి భీమవరం ఎం ఆర్ ఓ ఆక్వా రైతులకు సహకరిస్తారని, విదేశాల నుండి వచ్చినవారి కోసం, కరోనా వైరస్ అనుమానితుల వైద్య పరీక్షలకు ప్రత్యేక 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం మునిసిపల్  కమిషనర్ ప్రణాళిక సిద్ధం చేసారని, ప్రజలు ప్రభుత్వం కోసం కోకుండా తమ భవిషత్తు , ప్రాణాలు కోసం తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. 

 
 

Related Stories