తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

ప.గోదావరిలో పెళ్లి భోజనం పెట్టినందుకు అరెస్ట్..లాక్‌డౌన్‌ కేసు

Updated: March 25, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని అక్కంపేటలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ప్రభుత్వ ఆంక్షలు నేపథ్యంలో సైతం బంధుమిత్రులతో  ఆనందం కోసం వివాహ భోజనాలు ఏర్పాటు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తమ్ముడి  వివాహం అనంతరం తన ఇంట్లో ఏ  సుధాకర్‌ అనే వ్యక్తి  నిన్న సోమవారం పెద్దఎత్తున భోజన ఏర్పాట్లు చేశాడు.కరోనా ప్రభావం వల్ల ఐదుగురికి మాత్రమే భోజనాలు ఏర్పాటు చేసుకోవాలని, అంతకుమించి ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ నెల 22న పంచాయతీ కార్యదర్శి అతనికి నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. నిబంధనలను ఉల్లంఘించి భోజనాలు ఏర్పాటు చేయడంతో సుధాకర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ చెప్పారు.  144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఎటువంటి ఫంక్షన్లు, ఉత్సవాలు, జాతరలు నిర్వహించరాదు. 

 
 

Related Stories