తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

లాక్ డౌన్ లో జగన్ ప్రభుత్వ మినహాయింపులు..సహకారాలు

Updated: March 25, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించి  కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కట్టడి చేయగలమని భావిస్తున్న నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు తమిళనాడు బోర్డర్స్ వద్ద  అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసేశారు. సరుకుల కొనుగోలుకు కుటుంబంలోని ఒక్క వ్యక్తి మాత్రమే బయటకు రావాలి ..నిత్యావసర వస్తువుల రవాణా  వాహనాలు, అతి ముఖ్యమైన పనులపై వెళ్లే వాహనాలు అనుమతిస్తారు. ఇక పిల్లలు, ముసలి వారిని బయటకు పంపొద్దని ఆదేశించారు. ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయనున్నారు.ఈ లాక్ డౌన్ లో ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు  తీర్చే షాపులు  మినహా మిగతా వ్యాపార సంస్థలన్నింటిని మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారులెవరైనా అధిక ధరలకు సరకులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు  ప్రభుత్వం రేషన్ సరుకులను  ఈ నెల 29న అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ తో పాటు ఒక కిలో కందిపప్పు అందిస్తారు. ప్రతి  తెల్ల కార్డు దారుడికి ఉచితంగా రూ.1000 ను వచ్చే ఏప్రిల్ 4వ తేదీన  ప్రభుత్వం తరపున అందజేస్తారు. వార్డు సచివాలయ వాలంటీర్లు ప్రజలకు సహకారం అందిస్తారు.అలాగే  కరోనా వైరస్ అనుమానితులను గుర్తించి వైద్య సదుపాయాలకు ఏర్పాట్లు చేస్తారు. 

 
 

Related Stories