తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

కర్ఫ్యూ అద్భుతంగా అమలు..భారతీయులు కరోనాను వెలివేశారు..

Updated: March 25, 2020

సిగ్మా తెలుగు డాట్ కామ్ న్యూస్: ప్రపంచ జనాభా ను మృత్యుభయం  లోకి తీసుకొనివెళుతున్న మహమ్మారిపై యుద్ధానికి భారత ప్రజలు సాముహికంగా నేడు, ఆదివారం సిద్ధం అయ్యారు.అఖండ భారత ప్రజల సంపూర్ణ సహకారంతో కరోనా వైరస్‌ను తరిమేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటిస్తేనే భారత్‌ కోవిడ్‌ పోరులో విజయవంతమవుందని ప్రకటించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలోనే గడపాలని కోరారు. దీంతో ప్రజలు అద్భుతంగ  స్వాదించారు. వారు ఒక అడుగు ముందుకు వేసి నిన్న అర్ధరాత్రి నుండే..  అక్కడ లేదు.. ఇక్కడ లేదు.. జాతిలేదు.. మతం లేదు.. అందరు వారి వారి కుటుంబాలతో ఇండ్లకే పరిమితమయ్యి మిగతా ప్రాంతాలను ఖాళీగా వదిలేసారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కొరోనా ను వెలివేశారు.. దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వాహనాలు, రైళ్లను రద్దు చేశారు. విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో జాతీయ స్థాయిలో జనతా కర్ఫ్యూపై లైవ్‌ అప్‌డేట్స్‌..మార్చి 21 అంటే శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 3,700 రైళ్లను రద్దు చేశారు.గో ఎయిర్‌ విమానయాన సంస్థ స్వచ్ఛందంగా ఆదివారం అన్ని విమాన సర్వీసుల్ని నిలిపివేసింది. భారతీయుల సమైక్యత చూసి  కొరోనా లాంటి వైరస్ భూతానికి దడ పుట్టాక మానదు మరి.. 

 
 

Related Stories