తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

పవన్ కళ్యాణ్ ..వకీల్ సాబ్.. ఫస్ట్ లుక్ విడుదల

Updated: March 4, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  జనసేన రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో సినిమాలకు చాలాకాలంగా దూరంగా ఉన్న హీరో  పవన్ కళ్యాణ్ తిరిగి నటిస్తున్న  'వకీల్‌ సాబ్‌' చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. చాలా కాలం తర్వాత హిందీ లో ఘనవిజయం సాధించిన చిత్రం 'పింక్‌' ( అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో..) రీమేక్‌తో పవర్‌ స్టార్‌ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం టైటిల్‌ను వకీల్ సాబ్‌గా ఖరారు చేయగా.. ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. టైటిల్‌ని ధృవీకరిస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ ఓ పోస్ట్ చేసింది. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది .'ఆటో ట్రాలీలో ఓ పుస్తకం చదువుతూ.. కుర్చీలో కూర్చోని ఉండటం' ఫస్ట్ లుక్‌లో కనబడుతోంది. కాగా.. ఇది పవన్‌ కల్యాణ్‌ నటించిన 26వ చిత్రం. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారుఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో విదలచేస్తారని ఫిలిం నగర్ టాక్.. 

 
 

Related Stories