తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

తిరుమలలో 128 ఏళ్ల తర్వాత భక్తుల దర్సనం నిలిపివేత

Updated: March 22, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: కొన్ని ఊహకు అందనివి జరుగుతాయి. అటువంటిదే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన ప్రజలు పడకుండా ముందు జాగ్రత చర్యలలో భాగంగా కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో 128 ఏళ్ల తర్వాత ఏడుకొండలవాడి దర్శనం భక్తులకు నిలిచిపోనుంది. నిత్య కల్యాణం పచ్చతోరణంగా విలసిల్లే వడ్డీకాసులవాడి వైభవం కొద్దీ రోజుల పాటు ఏకాంతంగా సాగనుంది. లక్షలాది భక్తుల గోవిందనామస్మరణలతో మార్మోగే ఆపదమొక్కులవాడి సన్నిధి మూగబోనుంది. 1892వ సంవత్సరంలో శ్రీవారి ఆలయ జియ్యంగార్లు, అప్పటి మహంతుల మధ్య తలెత్తిన వివాదం వల్ల 2రోజులపాటు వెంకన్న దర్శనం భక్తులకు  నిలిపివేశారట... అయితే మరల ఇంతకాలానికి  కరోనా వైరస్‌ విజృంబణతో తిరుమలేశుని వీక్షించేందుకు భక్తులకు వారం రోజులు పట్టనుంది. తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు. కల్యాణోత్సవాన్ని సైతం ఏకాంతంగా జరిపించేందుకు నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చారు.

 

 

 
 

Related Stories