తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

తాను రాజకీయ పార్టీ పెట్టాలంటే..రజనికాంత్ షాకింగ్ వ్యాఖ్యలు

Updated: March 13, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తమిళ రాజకీయాలలో సినీ సూపర్ స్టార్ రజని కాంత్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఫై మరోసారి తాజగా ఆయన మాటలతో అనుమానంలో పడ్డాయి. తమిళ  తలైవా రజనీకాంత్‌ ఇటీవల రాష్ట్రంలోని రజనీ ప్రజాసంఘం జిల్లా కార్యదర్శులతో స్థానిక శ్రీరాఘవేంద్ర కల్యాణ మంటపంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ  భేటీ అనంతరం తానుఒక్క విషయంలో మోసపోయానని, అదేమిటన్నది త్వరలోనే చెబుతానని మీడియాతో చెప్పారు. కాగా రజనీకాంత్‌ మోసపోయానన్న వ్యాఖ్యలకు కారణాలు ఫై ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తున్నదంటున్నారు.. .. రజని మాటలలో  నేను బీజేపీ మద్దతుదారుడిని కాదనీ, అదే విధంగా కమలహాసన్‌ పార్టీ తో పొత్తుపై మీ అభిప్రాయం ఏంటనీ రజనీకాంత్‌ అనడంతో అక్కడ ఉన్నవారంతా షాకయ్యారని సమాచారం. ( అంటే మోసపోయింది ఏ పార్టీతో? ..) రజనీకాంత్‌ తన ప్యాన్స్ లీడర్స్ కొంతమందిపై  వారి పని తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని సభ్యులుగా చేర్చమని చెప్పాననీ, అది ఇంత వరకూ జరగలేదని అన్నారు.నా అదేశాన్ని పాటించడంలో ఎందుకింత అలసత్వం అని ప్రశ్నించారు. అదే విధంగా తాను ముఖ్యమంత్రిని కాదు, తనతో కలిసి రాజకీయాల్లోకి వచ్చేవారెవరికీ డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉండకూడదు.. ఈ నిబంధనలను అందరూ అంగీకరిస్తేనే పార్టీని ప్రారంభిద్దాం.. నాకు రాజకీయాలు సరిపడవు, సినిమాలే చాలు అని ఒక వారంలో ప్రకటిస్తానను అని రజనీకాంత్‌ చెప్పడంతో సమావేశంలోని వారందరూ ఖంగుతిన్నారని తెలుస్తుంది. 

 
 

Related Stories