తాజా వార్తలు   ప్రత్యేక ఆహ్వానితుల జీవోల సస్పెండ్.. ఎంపీ రఘురామ | ఆల్ ఇన్ వన్..అడవిబాపిరాజు జయంతి భీమవరంలో | ఐటి దాడులవెనుక ఎవరున్నారో తెలుసు .సోను సూద్ | సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనం..సంచలనం | భీమవరంలో గురజాడ 159 వ జయంతి సభలు | వాణిజ్య ఉత్సవ్‌ 2021 ప్రారంభించిన సీఎం జగన్ | కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి | కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు.. | 24, 25 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నుకొనే పద్దతి | ప్రధాని మోడీ అమెరికా పర్యటన..24న జోబైడెన్‌ తోచర్చలు |

చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల

Updated: April 15, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఇటీవల  ఏపీ తెలుగు దేశం పార్టీ ప్రెసిడెంట్ స్వయంగా  అచ్చేమ్ నాయుడు ఒక రహస్య వీడియోలో తిరుపతి ఉపఎన్నిక తరువాత ఈ నెల 17 తరువాత  పార్టీ ఉండదు,, బొక్క ఉండదు .. లోకేష్ వల్లే కదా పార్టీకి ఈ దుఃస్థితి, అని  టీడీపీ తెలంగాణ నేత ఆకుల వెంకటేశ్వర రావు తో అన్న మాటలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ కావడంతో అవి చిత్రీకరించిన ఆకుల వెంకటేశ్వరావు తనకు  చంద్రబాబు వల్ల ప్రాణ హాని ఉందని తనను చంపేస్తామని టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని తిరుపతి వెస్టు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసారు. నేడు, బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా తాను తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేశానన్నారు. పార్టీ కోసం డబ్బు కూడా పోగొట్టుకోనన్నారు, గతంలో కార్పొరేట్ ఎన్నికలలో హైదరాబాద్ లో టీడీపీ అబ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయానని,, అయితే చంద్రబాబు, లోకేష్అచ్చెన్నాయుడు లకు కు అత్యంత సన్నిహితుడైన కేఎల్‌ నారాయణ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్‌లోని  12 కోట్లు విలువైన నా 400 గజాల భూమిని కబ్జా చేశాడు. దీనిపై చంద్రబాబుతో పాటు బాలకృష్ణకు కూడా పలుమార్లు మొర పెట్టుకున్నాను. చంద్రబాబు ఒక మాట చెబితే నా భూమి నాకు నిమిషాల్లో వస్తుంది. అయితే ఆయన ఆ మాట చెప్పకుండా కబ్జాదారులతో కుమ్మక్కు అయ్యారు. ఇప్పడు  నేను తెలియనట్లు నటిస్తున్నారు. లోకేష్ అయితే నా కుటుంభం ఆత్మ హత్య చేసుకొన్నా చేసేది ఏమి లేదన్నారు. తిరుపతి బహిరంగ సభలో చంద్రబాబు ఎదురుగ చొక్కా విప్పేసి నిరసన చేస్తే నన్ను తోసేశారు. నేను ఆయనపై రాయి ఏమి విసరలేదు.. బాబుపై ఎలాంటి రాళ్లూ పడలేదు. బాబు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం సహజమే. అందుకే నాకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాను అని అన్నారు. 

 
 

Related Stories