తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్‌ సర్జరీ విజయవంతం

Updated: April 2, 2021

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: ఇటీవల  ఛాతీలో నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం  నేడు, మంగళవారం ఆయనకు బైపాస్‌ సర్జరీ విజయవంతంగా చేశారు. ఈ విషయాన్ని ఎయిమ్స్‌ తాజాగా  అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆరోగ్యం కుదుటగా ఉందని.. కోలుకుంటున్నారని వెల్లడించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  కూడా తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ వైద్యులను ఆయన అభినందించారు.ఈనెల 27వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఛాతీ నొప్పితో సైనిక (ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌) ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించాయి.ఈ మేరకు  ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ చేరటం అక్కడి వైద్యులు తాజగాఆయనకు బైపాస్‌ సర్జరీ చేసి విజయవంతం చెయ్యడం జరిగింది. 

 
 

Related Stories