సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు తన ఎంపీ కార్యాలయం ఉన్న భీమవరం లో కాదు కదా! సీఎం జగన్ రాముడో.. రావణుడో తేలేవరకు, అసలు ఏపీలో కాలుపెట్టనని ప్రతినపూనారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తన గురించి నేను కనపడటం లేదని ఎన్నివ్యంగ్య పోస్టర్లు వేసినా.. ఏం చేసినా రాష్ట్రానికి రానన్నారు. తానోక మహా యజ్ఞం చేపట్టానని, సర్పయాగమని.. అది పూర్తయ్యే వరకు రానన్నారు. వైసీపీని కాపాడుకునే ప్రయత్నంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసు వేసానన్నారు. నేను ముఖ్యమంత్రి రాముడని అనుకుంటున్నా.. రావణుడని కొందరు అనుకుంటున్నారు. తిరుపతిలో వైసీపీ నెగ్గడం ఖాయం.. రెండు లక్షల మెజారిటీ వస్తుందని’ రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేసారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు వేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు రిటర్న్ చేసింది. పిటిషన్ ప్రొసీడింగ్స్ సరిగా లేవని ఈ సందర్భంగా సీబీఐ కోర్టు తెలిపింది. సరైన డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది