సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: గత ఏడాదిగా కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లకు సంబంధించి విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఫిక్స్డ్ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు భారీ ఊరట లభించనుంది. దీంతో సీఎం వైఎస్ జగన్ కు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అక్కినేనితో పాటు పలువును సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో వేలమందికి ఉపాధి కలిపిస్తున్న సినీ పరిశ్రమ బ్రతుకుతున్న వారికీ ఉపాధి కల్పించడానికి పెద్ద మనస్సుతో ఏపీ లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆదుకున్నారని, సీఎం జగన్ తాజా సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.