తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

ఇస్లామిక్ తీవ్రవాదాన్ని భారత్ తో కలసి ఎదుర్కొంటాం .. ట్రాంప్

Updated: February 27, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ట్రంప్‌ దంపతులు తొలుత రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించి.. ఆ తర్వాత హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. తనకు అద్భుత స్వాగతం పలికిన ప్రధాని మోదీ, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారత పర్యటనలో భాగంగా అత్యాధునిక సాంకేతికత కలిగిన అపాచీ, రోమియో హెలికాప్టర్ల కొనుగోలుతో పాటు.. 3 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను భారత గడ్డపై నుంచి ట్రంప్‌ హెచ్చరించారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తున్నామని... అతివాద ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొంటామని ప్రకటించారు. . అదే విధంగా భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా తన హయాంలో భారత్‌- అమెరికా సంబంధాలు, ఎగుమతులు బాగా పెరిగాయని తెలిపారు. భారత్ లో మహాత్మా  గాంధీకి నివాళులు అర్పించడం తన జీవితంలో గొప్ప విషయమని  అన్నారు. అదే విధంగా ప్రపంచంలోనే అత్యద్భుతమైన తాజ్‌మహల్‌ను సందర్శించడం గొప్ప అనుభూతి కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు. నేటి సాయంత్రం  ఐదు గంటలకు మరోమారు ప్రెస్‌తో మాట్లాడతానని ట్రంప్‌ పేర్కొన్నారు.

 
 

Related Stories