సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నేడు, గురువారం ఉదయం తన బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు. కాగా ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం మార్చి 31 నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఖరారు చేశారు.