సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇటీవలె సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ హీరో తనీష్‌కు ( చిన్న నాటి నుండి నటిస్తూ ఇటీవల బిగ్ బాస్ టివి షో లో పాపులర్ అయ్యాడు.) బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు జరిగే విచారణకు హాజరు కావాలంటూ తనిష్‌తో పాటు మరో ఐదుగురికి పోలీసులు సమన్లు జారీ చేశారు. వీరిలో ప్రముఖ నిర్మాత శంకర్ గౌడతో పాటు ఓ వ్యాపార వేత్త కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత శంకర్ గౌడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్న పలువురు సెలబట్రీలకు నోటీసులు పంపినట్లు బెంగుళూరు పోలీసులు ధృవీకరించారు. తెలుగులో తనీష్ ఫై గతంలో కూడా డ్రగ్స్ నీలినీడలు కమ్ముకొని అతని కెరీర్ ఇబ్బందులలో పడటం జరిగింది.