తాజా వార్తలు   భీమవరం వద్ద MLA నిమ్మల సైకిల్ యాత్రను అడ్డుకొన్న పోలీసులు | ఆంధ్ర ప్రదేశ్ లో 266 కొరోనా కేసులు, దేశంలో 4200 పైగా.. | దీప యజ్ఞం విజయవంతం..బీజేపీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం.. | కరోనా భయం గుపిట్లో హైదరాబాద్ బస్తీలు ..తెలంగాణాలో 334 రోగులు. | మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు,కానీ..చిరంజీవి వివరణ | భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ 5 లక్షల విరాళం MLA కు అందజేత | గత ఆదివారానికి బిన్నంగా భీమవరం ..కరోనా ఫై కొత్త నిర్ణయాలు | FLASH: కరోనా కు మందు కనిపెట్టాం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు | ఇండియా అద్భుతం..మోడీ మాకు సాయం చెయ్యండి..ట్రంప్ | భీమవరం కరోనా సమీక్షలో MLA గ్రంధిశ్రీనివాస్ కీలక ఆదేశాలు |

కరోనా వైరస్ తో ప్రపంచ జనాభాలో 60 శాతంకు ముప్పు ?

Updated: February 13, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ప్రస్తుతం చైనాను  గడగడలాడిస్తున్న కొరోనా వైరస్ ను  అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సకాలంలో ఫలించక పోయినట్లయితే , దాని నివారణ మందు కనిపెట్టలేకపోతే  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతానికి పైగా జనాభా ఈ వైరస్‌ బారిన పడి చనిపోతుందని హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మెడికల్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ గాబ్రియల్‌ లియంగ్‌ తీవ్ర  హెచ్చరించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 43 వేల మంది ఈ వైరస్‌ బారిన పడగా, ఒక్క చైనాలోనే 42 వేల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా మరణించారు. అయితే   నిజానికి వాస్తవాలు ఇంకా ఆందోళనకర స్థాయిలో  ఉంటాయని పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు వైద్యులు చెబుతున్నారు.  నాబైరస్‌ సోకిన ప్రతి రోగిద్వారా రెండున్నర శాతం మందికి సోకుతోందని, ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా 60  శాతం మంది ఈ వైరస్‌ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  కరోనా వైరస్‌ శాంపిల్స్‌ను అన్ని దేశాలు తెప్పించుకొని త్వరితగతిన నివారణ మందు కనుగొనేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి డాక్టర్‌ టెండ్రాస్‌ అధానమ్‌ పిలుపు నిచ్చారు. 

 
 

Related Stories