తాజా వార్తలు   కర్నూల్ లో దారుణం..ఒక కుటుంబం ఆత్మహత్య | అచ్చెన్నాయుడు సోదరుడిపైన,కుమారుడిపైన రౌడీషీట్లు | పశ్చిమ గోదావరిలో లారీ–బస్సు భీకర ఢీ... | మా ఎన్నికలు బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత... | భీమవరం మహిళలకు 20 కోట్ల పైగా చేయూత నిధులు | కోవిద్ కట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ అందరికి ఆదర్శం..చిరంజీవి | ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలంటే..సుప్రీం ఆదేశం | ఈ29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన | YSR చేయూత .4వేలపైగా కోట్లు .మహిళల ఖాతాల్లో జమ | జూలై 1 నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బోధన.. |

భీమవరం,ఏలూరులలో జేఈఈ–2021 మెయిన్‌ పరీక్షలు..

Updated: February 24, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:జాతీయ సంస్థల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు ఆన్ లైన్ లో ఈ నెల 26 వరకు నిర్వహించే జేఈఈ–2021 మెయిన్‌ పరీక్షలు నిన్న మంగళవారం నుండి  భీమవరం, ఏలూరు  తాడేపల్లిగూడెం కేం ద్రాల్లో ప్రారంభమయ్యాయి. ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీ రింగ్‌ కళాశాలలో తొలి రోజు 150 మంది అభ్యర్థులకు 128 మంది, రామచంద్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో 88 మందికి 76 మంది హాజరయ్యారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 280 మందికి 266 మంది,  భీమవరం పెన్నాడ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కేంద్రం లో 89 మందికి 81 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు, నేడు, బుధవారం కూడా జేఈఈ–2021 మెయిన్‌ పరీక్షలు  రాసే విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేసారు. ఎల్లుండి శుక్రవారంతో పరీక్షలు ముగుస్తాయి. 

 
 

Related Stories