సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నేడు, మంగళవారం స్థానిక మునిసిపల్ కౌన్సిల్ హాలులో మునిసిపల్ కమిషనర్ M శ్యామల దేవి అడ్జక్షతన పట్టణంలోని అన్ని వార్డ్ ల సచివాలయ సిబ్బంది అడ్మిన్లతో, టౌన్ ప్లానింగ్ కార్యదర్సులు, అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలో నిర్మిస్త్తున్న కొత్త గృహాలకు తప్పని సరిగా జియో ట్యాగింగ్ లో సంబధిత వ్యక్తుల వివరాలు పొందుపరచాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించనున్న గృహాల కార్యాచరణపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో హోసింగ్ డీఈ వెంకట రమణ మరియు పబ్లిక్ హెల్త్ డీఈ కూడా పాల్గొని పలు సూచనలు ఇవ్వడం జరిగింది.