సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భీష్మ ఏకాదశి సందర్భంగా భీమవరం పట్టణంలో అన్ని వైష్ణవ ఆలయాలలో పత్యేక పూజలు, కార్యాక్రమాలు ఏర్పాటు చెయ్యడం తో నేడు, మంగళవారం భక్తులు విశేషంగా హాజరు అయ్యి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. భీమవరం జేపీ రోడ్ లోని శ్రీ పద్మావతి శ్రీనివాస దేవాలయం మరియు హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి మందిరంలో శ్రీవారికి తోమాలసేవ, అర్చన వైఖానస ఆగమోక్తంగా భోగ మూర్తులకు గో క్షీరాభిషేకం నిర్వహించారు. మహిళలు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం పద్మావతి మహిళా పారాయణ బృందంచే నిర్వహించారు. శ్రీవారి మూలమూర్తికి నక్షత్ర హారతి సమర్పణ, పచ్చ కర్పూర హారతి, నీరాజనం మంత్రపుష్పం లు తీర్థ గోష్టి నిర్వహించారు.(ఫై చిత్రంలో చూడవచ్చు)