సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్:ఇటీవల వచ్చిన `ఉప్పెన` సినిమాలో తమిళ సినీ హీరో, నటుడు విజయ్ సేతుపతి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్రకు విజయ్ సేతుపతి కచ్చితంగా సరిపోతాడని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. తన కథలో ఎన్టీయార్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో గతంలో బసిరెడ్డి గా జగపతి బాబు నట విశ్వరూపంతో చెలరేగిపోయినట్లే .. సేతుపతి కూడా స్పెషల్ ఎట్ట్రాక్షన్ అవుతారని త్రివిక్రమ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ , విజయసేతుపతి కాంబినేషన్ తెరపైకి తేవడానికి రంగం సిద్ధం అవుతుంది. త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.