తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

వెంకటేష్ దృశ్యం-2 లో కీలక పాత్రలో రానా..

Updated: March 14, 2021

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: విక్టరీ వెంకటేష్ అద్భుతంగ అభినయించిన  దృశ్యం’ సినిమా చూసినవారికి కథ తెలిసే ఉంటుంది. ఒక కుర్రాడు అమ్మాయిని వేధించి, ఒక మధ్యతరగతి కుటుంబం చేతిలో హత్యకు గురవుతాడు అబ్బాయి. ఆ హత్య చేసింది ఎవరో పోలీసులు తెలుసుకోలేకపోతారు. చివరికి కేసు క్లోజ్‌ అయిపోతుంది. ‘దృశ్యం 2’లో కొత్త ఇన్‌స్పెక్టర్‌ చార్జ్‌ తీసుకున్నాక కేసుని రీ ఓపెన్‌ చేస్తారు. మళ్లీ అమ్మాయి తండ్రి రాంబాబు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్‌లు మొదలుపెడతాడు. రాంబాబు పాత్రలో వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో మీనా నటించిన ‘దృశ్యం’కి సీక్వెల్‌ ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే.మలయాళంలో మురళీ గోపీ చేసిన కొత్త ఇన్‌స్పెక్టర్‌ పాత్రను తెలుగులో రానా చేయనున్నారని ఫిల్మ్ వర్గాల టాక్‌. రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో వెంకటేశ్‌ ‘బళ్లారి బావ..’ పాటలో గెస్టుగా  కనిపించారు. ఇప్పుడు ఈ బాబాయ్‌తో అబ్బాయ్‌ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తే దృశ్యం 2 కు రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.. 

 
 

Related Stories