తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా

Updated: March 6, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: గత కొంత కాలంగా  బెజవాడ టీడీపీలో విభేదాలు బగ్గుమంటూ, కార్పొరేషన్ ఎన్నికలలో ఎంపీ కేసినేని నాని కుమార్తెకు మేయర్ అభ్యర్థిగా టికెట్ రావడంతో  నేడు, శనివారం పూర్తీ స్థాయిలో  దూషణ  పర్వముతో రచ్చకెక్కయి. విజయవాడ టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతల మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది. కేశినేని నానిపై బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన గురించి మాకు కనీసం సమాచారం ఇవ్వరా?. రూట్‌ మ్యాప్‌ మార్చడానికి కేశినేని ఎవరని వారు  ప్రశ్నించారు. ‘చంద్రబాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే.. మేం ఆ పర్యటన బహిష్కరిస్తాం. మాకు ఏ గొట్టం గాడు అధిష్టానం కాదంటూ’ వారు నిప్పులు చెరిగారు. ‘‘టీడీపీని కుల సంఘంగా మార్చాలని కేశినేని అనుకుంటున్నారా?. దమ్ముంటే కేశినేని ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలవాలి. కేశినేని చెప్పుచేతల్లో బీసీలు బతకాలా?. కేశినేని నాని చేసేవన్నీ చీకటి రాజకీయాలు. రంగా హత్య కేసు నిందితులందరూ కేశినేని వెంటే ఉన్నారంటూ’’ బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తీవ్ర విమర్శలు గుప్పించి అసలే పార్టీని రక్షించుకునే పనిలో ఉన్న చంద్రబాబు కు కొత్త తలనొప్పి తెచ్చారు.

 
 

Related Stories