సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలో చేరిపోయే రికార్డు ఉన్న ప్రస్తుత, విశాఖ ఉత్తరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల, తాను టీడీపీ లోనే ఉంటానని కానీ తనపై లేనిపోని అపవాదులు వేస్తున్నారని, తాను వైసిపిలో చేరుతున్నట్లు వైసిపి ఎంపీ విజయసాయి మైండ్ గేమ్ ఆడుతున్నారని, తాను ఏమి ప్రతిపాదన చేశానో చెప్పాలని గంటా చేసిన సవాల్ కు విజయసాయి స్పందించారు. గతంలో గంటా తమ వైసిపిలో చేరడానికి ప్రతిపాదన పంపారని, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. సి.ఎమ్. నిర్ణయం తర్వాత తాము గంటా ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. తాము మైండ్ గేమ్ ఆడవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గంటా వైసిపిలోకి వచ్చినంతమాత్రాన ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు ఉండవని కూడా ఆయన స్పష్టం చేశారు.అయితే గంటా చేరికపై ఉత్తరాంధ్ర వైసిపి నేతలు సుముఖంగా లేరు. .