తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు

Updated: March 5, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తాజగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై వాహనదారులు సమయాభావం చెందకుండా ఆర్టీఓ కార్యాలయాలు అందించే ముఖ్యమైన సేవలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో ద్వారా పొందవచ్చు అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు 18 రకాల సేవలను ఆధార్ అనుసంధానం ద్వారా వినియోగించుకునేలా మార్పులు చేసింది. ఈ సేవల కోసం ఆర్టీఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులో అడ్రస్ మార్పు, ఆర్ సీ రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ వంటివి ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చు.కొత్త డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడంలో ఆధార్ ధృవీకరణ తప్పనిసరని మంత్రిత్వ శాఖ ఇంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. 
 
 
 

Related Stories