తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

Updated: March 5, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  భీమవరంలో నేడు, శుక్రవారం   లూథరన్ హైస్కూల్ మైదానంలో భీమవరం ప్రీమియం లీగ్ (బిపీఎల్)  జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. స్వహత గా గతంలో క్రికెట్ ఆడిన అనుభవంతో ఆయన కొద్దీ సేపు  క్రిడాకారులతో కలసి బ్యాటింగ్ , బొలింగ్ చేసి వారిని ఉత్సహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ యువ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అన్ని రంగాలలో  పోటీతత్వం అనేది సహజమని, నేటి యువత నేడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఫిట్ నెస్ పెంచుకోవాలని , గెలుపు ఓటములు సమానంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ఇటువంటి క్రీడా స్ఫూర్తి టోర్నమెంట్ లు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ 10 రోజులపాటు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, జిల్లా నలుమూలల నుంచి సుమారు 64 టీమ్స్ పాల్గొంటున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ తిరుమాని ఏడుకొండలు, కామన నాగేశ్వరావు, కొల్లి ప్రసాద్, కోడె యుగంధర్, డాక్టర్ ప్రసాద్, రామకృష్ణ, చుక్క కిషోర్, అల్లు శ్రీనివాస్, చంద్రశేఖర్, శివ, అనిల్, ప్రిన్స్, బైరెడ్డి, సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Related Stories