తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం

Updated: March 5, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: విశాఖ ఉక్కు పరి రక్షణ లో భాగంగా కేంద్రంపై ఒత్తడి తేవడానికి నేడు, శుక్రవారం  అధికార పార్టీ వైసిపి పూర్తీ మద్దతు ప్రకటించిన రాష్ట్ర బంధు లో భాగంగా భీమవరంలో  స్థానిక ఎం ఎల్ ఏ గ్రంధి శ్రీనివాస్ మద్దతుతో బీజేపీ మినహా , టీడీపీ ,జనసేనతో పాటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో,లెఫ్ట్ పార్టీలు,నేతలు కార్మిక సంఘాలు, ప్ర‌జా సంఘాలు నేటి ఉదయం 7 గంటల నుండి ప్రధాన రోడుల గుండా కేంద్రానికి నిరసన తెలియజేస్తూ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సు లు నిలచిపోయాయి. తదుపరి అన్ని పార్టీల ఆధ్వర్యంలో, వారి వారి నేతలతో  ప్రకాశం చౌక్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ.. ఎన్నో లక్షల మందికి ఉపాధి కలిపిస్తూ,  24 వేల ఎకరాల తో లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులతో కేంద్ర ప్రభుత్వ సంస్థలలో అగ్రగామిగా నిలిచి, ఆంధ్ర ప్రదేశ్ కు గర్వకారణంగా నిలచిన విశాఖ ఉక్కు ను ప్రవేటీకరణ చేస్తూ మన ప్రాంత ప్రజలను, కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం దిగి వచ్చి విశాఖ ఉక్కును కేంద్ర సంస్థగా ఉంచుతామని, స్వంత గనులు కేటాయిస్తామని  ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేసారు. బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారు.అన్ని విద్యాసంస్థలు  ట్రావెల్స్,  కూడా బంద్ పాటిస్తుండ‌టంతో జ‌న‌ సంచారం స్తంభించింది. ( ఫై తాజా చిత్రం భీమవరంలోనిది)

 
 

Related Stories