తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

భీమవరం పంచారామంలో మహాశివరాత్రి వేడుకలు..9 నుండి

Updated: March 4, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భీమవరం, గునుపూడిప్రాంతంలో పవిత్ర పంచా రామాలలో అత్యంత విశిష్టమైనది.. సాక్షాత్తు చంద్ర ప్రతిష్టగా పురాణాలూ చెబుతున్న శ్రీ సోమేశ్వర  స్వామి దేవాలయంలో ఈ మర్చి 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు మహాశివరాత్రి నేపథ్యంలో భక్తులకు ఆహ్వానం పలుకుతూ శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని దేవాలయ ఇఓ అరుణ్ కుమార్,  సిగ్మా న్యూస్ కు తెలిపారు. ( పైన తాజా ఫోటో)  ఈ నెల 9 వ తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభమౌతాయని, చలువ పందిళ్లు, భారీ క్యూ లైన్ లు ఏర్పాటు చేస్తున్నామని, 11 వ తేదీ మహాశివరాత్రి తెల్లవారు జాము 2 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు శ్రీఘ్ర దర్శనం ఉంటుందని, దీపారాధనలూ ఆలయం బయటే చేసుకోవాలని, అయితే కోవిద్ నిబంధనలు మేరకు మాస్క్ లు ధరించని వారికీ దేవాలయంలోపలికి  అనుమతి లేదన్నారు. ఆ రోజు ఉదయం శ్రీ స్వామి వారి కల్యాణోత్సవం వేద పండితులతో  నిర్వహిస్తామన్నారు. ఉచిత ప్రసాదాల వితరణలో తగిన జాగ్రత్తలు తీసుకొంటామన్నారు. ఇక 12 వ తేదీ మద్యాహ్నం రధోత్సవం ,13 వ తేదీబాణాసంచా కాల్పులతో భక్తులు సమక్షంలో సోమగుండంలో  రాత్రి 8గంటలకు తెప్పోత్సవం తో ఉత్సవాలు ముగింపు ఉంటుందని 14వ తేదీ సాయంత్రం 7 గంటలకు  తోలు బొమ్మలాట తో కార్యక్రమాలు పరిపూర్తి అవుతాయని తెలిపారు. 

 
 

Related Stories