తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

షర్మిలకు ఆస్తులు,పదవులు ఇవ్వకుండా మోసం..చంద్రబాబు

Updated: March 4, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: కర్నూలులో చంద్రబాబు రోడ్ షో ద్వారా నేడు, గురువారం  మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ఒక ఉన్మాది అని, రాష్ట్రము లో అభివృద్ధి లేదని,  ఆయన పథకాలు అమ్మవడి, ఇంటింటికి రేషన్  బాగోలేదని,  ఆటో డ్రైవర్ లకు కేవలం 10 వేలు ఇస్తే  ఈ కరోనా సమయంలో ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.జగన్ తండ్రి  వైఎస్ తనను గౌరవించేవాడని, జగన్ మాత్రం అవమానిస్తాడని, ఇక ఇతని సోదరి షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని  షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. జగన్ పిరికి పంద అంటూ జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు. రోడ్‌షోలో చంద్రబాబు ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలతో మాట్లాడారు. 

 
 

Related Stories