తాజా వార్తలు   అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ | సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల రద్దు..12వ తరగతి వాయిదా | చంద్రబాబు నుండి ప్రాణ హాని ఉంది.. రక్షించండి..ఆకుల | భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన MLA | శ్రీమావుళ్ళమ్మ కళావేదికపై ఆకట్టుకొన్న అష్టావధానం | భీమవరం శ్రీ సోమారామంకు 1 లక్ష రూ, కానుక | 24 గంటలలో1,85,190 కరోనా కేసులు.. | చేప రేటు ఢమాల్..భీమవరం ఆక్వా రైతుఫై కరోనా కష్టాలు | పాపికొండల మధ్య బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం | చంద్రబాబు ఫై రాళ్లు వేస్తారా? భీమవరంలో టీడీపీ నిరసన |

నిమ్మగడ్డకు ఒక రోజులో హైకోర్టు లో షాక్ మీద షాక్

Updated: March 3, 2021

సిగ్మాతెలుగు డాట్  కామ్, న్యూస్:‌ ఏపీ  ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు మరోసారి హై కోర్టులో షాక్ మీద షాక్  తగిలింది. మున్సిపల్‌ ఎన్నికల్లో రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తూ జారీ చేసిన ఆదేశాలను నేడు, బుధవారం హైకోర్టు కొట్టివేసింది. కొత్తగా మున్సిపల్‌ నామినేషన్లకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి వార్డు వాలంటీర్లపై ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టేసింది. వాలంటీర్ల ట్యాబ్‌లను, ఫోన్ లను  స్వాధీనం చేసుకోవద్దని సూచించింది. కాగా, తిరుపతి కార్పోరేషన్‌లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్‌కు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీ నామినేషన్‌కి అవకాశమిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. 
 
 

Related Stories