సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: విజయవాడ లో పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిఫై, శ్రీ కనక దుర్గ గుడిలో పనిచేసే ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అందజేసిన నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, స్టోర్స్, హౌస్ కీపింగ్ విభాగపు సూపరింటెండెంట్లతో పాటు, గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలను పర్యవేక్షించేఅమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్‌బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.వెంటనే సూపరింటెండెంట్లను ఆగమేఘాలమీద సస్పెండ్ చేస్తూ ఈవో సురేష్‌బాబు చర్యలు తీసుకున్నారు.