తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన స్వతంత్ర అడుగు..

Updated: February 23, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భారతదేశ అగ్రశ్రేణి వ్యాపారవేత్త  ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) సంచలన నిర‍్ణయాన్ని ప్రకటించింది. తన ఆయిల్-టు-కెమికల్స్ (ఓటూసీ) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందిస్తున్నట్లు నేడు, మంగళవారం ప్రకటించింది. వ్యాపార బదిలీతో కొత్తగా ఏర్పడిన ఈ అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ, నియంత్రణ  కలిగి ఉంటుందని ఆర్‌ఐఎల్ తెలిపింది. మొత్తం అపరేటింగ్‌ టీం, కొత్త సంస్థలోకి మారుతుందనీ, అలాగే ఆదాయాలను తగ్గించడం లేదా నగదు ప్రవాహాలపై ఎటువంటి పరిమితులు ఉండవని పేర్కొంది.పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రమోటర్ గ్రూప్ ఓటూసీ వ్యాపారంలో 49.14 శాతం వాటాను కలిగి ఉంటుందనీ, ఈ ప్రక్రియతో కంపెనీ వాటాదారుల్లో ఎలాంటి మార్పు ఉండదని రెగ్యులేటరీ సమాచారంలో రిలయన్స్‌ వెల్లడించింది.2022 నాటికి ముంబై, అహ్మదాబాద్ ఎన్‌సీఎల్‌టీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది.   
 
 

Related Stories