సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నేడు, సోమవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ప్రథమ చికిత్స కోసం 108 వాహనాల ద్వారాతాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తీ వివరాలు అందవలసి ఉంది.