సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసియా ఖండంలోనే ప్రతిష్టాకర నీటి ప్రాజెక్టుగా చెప్పుకొనే పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనుల్లో మరో కీలక ఘట్టం ను సీఎం జగన్ సర్కార్ సంకల్ప బలం తోపాటు నిష్ణాతులయిన ఇంజనీర్స్ , శ్రామికుల బలంతో కేంద్ర సహకారంతో పూర్తిచేసింది.. స్పిల్ వేకు 192 గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియను రికార్డు సమయం లో ప్రభుత్వం పూర్తి చేసింది. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు. ప్రపంచంలో సాగు నీటి ప్రాజెక్టుల స్పిల్ వేల్లో ఇంత బరువైన గడ్డర్లను వినియోగించ డం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా 1,128 మీటర్ల పొడవుతో స్పిల్ వేను నిర్మిస్తున్నారు. స్పిల్ వేకు 49 పిల్లర్లను (పియర్స్) 52 మీటర్ల ఎత్తున ఇటీవల ప్రభుత్వం రికార్డు సమయంలోనే పూర్తి చేసింది.కరోనా, వరద ఉధృతి అడ్డంకిగా మారినా లెక్క చేయకుండా పనులు కొనసాగించి కేవలం ఏడు నెలల్లోనే గడ్డర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందన్నమాట. మరోవైపు 1,105 మీటర్ల పొడవున ఇప్పటికే స్పిల్ వే బ్రిడ్జిని ప్రభుత్వం పూర్తి చేసింది. మిగిలిన 23 మీటర్ల స్పిల్ వే బ్రిడ్జి పనులను ఈనెల 25 నాటికి పూర్తి చేస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి.2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.