సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: గుంటూరు శివారులోని పెదపలకలూరులో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీ హాస్టల్ క్యాంపస్లో కమిషన్ సభ్యులు వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్, బి.ఈశ్వరయ్య ఆకస్మిక తనిఖీలు చేశారు.అక్కడి దారుణ పరిస్థితులు చూసి విస్తు పోయారు. వారు మాట్లాడుతూ.. ‘విద్యార్థుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ.. కనీస వసతులు కూడా కల్పించరా? అంటూ నారాయణ జూనియర్ కాలేజీపై ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.క్యాంపస్లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు ఆహారం వండే కిచెన్లో టమోటాలు, క్యాబేజీ సహా కుళ్లిన కూరగాయలను అలాగే ఉంచడాన్ని గమనించి ఇలాంటి వాటిని వండుతారా ?.వేలాది రూపాయలు వసూలు చేస్తూ.. విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని కూడా అందించలేరా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో పిల్లలను ఇలాగే చూస్తారా అంటూ సిబ్బందిని నిలదీశారు.నారాయణ కాలేజీ యాజమాన్యానికి నోటీసు జారీ చేస్తామని చెప్పారు. యాజమాన్యం సరైన రీతిలో స్పందించకపోతే.. కాలేజీని మూసివేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. కాగా, ఇప్పటి వరకు 40 కాలేజీలకు నోటీసులు జారీ చేశామన్నారు