తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

విశాఖ ఉక్కు రక్షణ కోసం..భీమవరంలో ఉద్యమ వేడి

Updated: February 8, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం ..ఇక్కడ ఎన్నోవేల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేద్దామని  సిద్ధం కావడంపై  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వేడెక్కుతున్నాయి.ఇప్పటికే  భీమవరంలో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో  పురవీధుల గుండా ప్రజా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నేడు, శనివారం  స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో స్వచ్ఛంద సంస్థలు, అఖిల పక్ష నాయకులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి మాట్లాడుతూ 1971లో ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారని, 32 మంది ప్రాణ త్యాగాలతో అమృతరావు నిరసన దీక్షతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ దారుణమని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకుని నిర్ణయం తీసుకోక పోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో చెరుకువాడ రంగ సాయి, జనసేన నాయకులు యిర్రింకి సూర్యారావు, లంక కృష్ణ మూర్తి,. కార్యక్రమంలో చెళ్లబోయిన రంగారావు, ఉండపల్లి రమేష్ నాయుడు, ఎస్ కే అన్సారీ, గంట సుందర కుమార్, తదితరులు పాల్గొన్నారు

 
 

Related Stories