తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

రైతులు తగ్గేదిలేదు..రోడ్లను దున్ని వ్యవసాయం చేస్తాం..రాకేశ్‌

Updated: February 8, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: గత 75 రోజులుగా జరుగుతున్నారైతు ఉద్యమం కు  ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు వెనుతిరగడం లేదు. కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులు, రైతు నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. తాజాగా నేడు, శనివారం జాతీయ రహదారుల దిగ్బంధం (చక్కా జామ్‌) కార్యక్రమం చేపట్టగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి విశేష స్పందన లభించింది. చక్కా జామ్‌ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ- ఉత్తరప్రదేశ్‌ రహదారి ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద జరిగిన ఆందోళనలో భారత్‌ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ మాట్లాడారు. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లో దురాక్రమణదారులు తమ ఉద్యమాన్ని హింసాత్మకం చేయాలని చూశారని ఆరోపణలు చేశారు. ఈ రహదారుల దిగ్బంధం ఈరోజుతో ముగిసేది కాదని.. అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి వరకు కొనసాగుతుందని రాకేశ్‌ ప్రకటించారు. అప్పటివరకు రోడ్లపైనే వ్యవసాయం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. రోడ్లను దున్ని వ్యవసాయం చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా రైతుల ఈ పిలుపుతో ఉద్యమం తారస్థాయికి చేరనుంది.
 
 
 

Related Stories