తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

బడ్జెట్ లో ఏపీ కి తీవ్ర అన్యాయం..విజయసాయి రెడ్డి

Updated: February 3, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండి చేయి చూపారని ,రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ . కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌ పూర్తిగా‌ నిరాశపరిచిందని, ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. అతి త్వరలో  ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారని మండిపడ్డారు. ఇది ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు చెందిన బడ్జెట్‌లా ఉందని ఆరోపించారు. మెట్రోరైలు కోసం ఆరేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా కేటాయించలేదని.. కానీ రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేని కారిడార్‌ ప్రకటించారని విమర్శించారు.ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి అసలు శ్రద్ధ లేదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు 

 
 

Related Stories