తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

అగ్రదర్శకుడు శంకర్ కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్

Updated: February 3, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: ఒకనాడు దేశంలోనే అగ్రదర్శకుడుగా చెలామణి అయినా శంకర్ కు టైం కలసిరావడం లేదు. ఒక ప్రక్క వందల కోట్లు ఖర్చుచేసినా  ప్లాప్ అవుతున్న సినిమాలు..  మరో ప్రక్క భారతీయుడు 2 నిర్మాణం ఎదో అడ్డంకులతో ఆగిపోవడం, అసిస్టెంట్ల మరణాలు ఇలా ఎన్నో.. తాజగా తెలుగులో రాబో సినిమాగా వచ్చిన తమిళ వెర్సషన్  ‘యందిరన్‌’ చిత్ర కథ వ్య వహారానికి సంబంధించి ఎస్‌.శంకర్‌కు చెన్నై ఎగ్మూరు కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. తన కథను శంకర్‌ చోరీ చేసి ‘యందిరన్‌’ చిత్రాన్ని నిర్మించారంటూ కథా రచయిత ఆరూర్‌ తమిళ్‌నాడాన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం పదేళ్లుగా ఆయన కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఎగ్మూర్‌ క్రైం కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అలాగే, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ గతంలో శంకర్‌ హైకోర్టు తో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని కోర్టులు తిరస్కరించాయి. ఆ తర్వాత కూడా ఆయన కోర్టు విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. 

 
 

Related Stories