సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: వరుసగా నిర్మాణంలో ఉన్న అన్ని సినిమాల డేట్స్ ముందే ప్రకటించి తమ తమ పండుగల సీట్లు ముందే రిజర్వ్ చేసుకొంటున్నారు నిర్మాతలు.. తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు వారి కొత్త ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటుంది. అయితే ఇప్పటి వరకు పవన్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో వకీల్ సాబ్ యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ డేజ్ ప్రకటించడంతో చాల ఏళ్లుగా పవన్ సినిమా కోసం ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానులు కు ఇది శుభవార్తే..