సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: నేడు, శుక్రవారం సంక్రాంతి కనుమ పండుగ నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాంప్రదాయ తెలుగు పంచెకట్టుతో పాల్గొన్నారు. నేటి ఉదయం 11.30 సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. తొలుతగా మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం టీటీడీ డాలర్ శేషాద్రి నేతృత్వంలో గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు