సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) శుభవార్త తెలిపింది. బుక్‌చేసుకున్న గంటలోనే (30-45 నిముషాలు) గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ చేయడానికి తత్కాల్ సర్వీసును ప్రారంభించేందుకు ఐఓసీఎల్ సన్నాహాలు చేస్తోంది. తత్కాల్ సేవలందించే క్రమంలో ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక ప్రముఖ నగరం లేదా జిల్లాను గుర్తించనున్నారు. సింగిల్ సిలిండర్ వినియోగదారులకు గ్యాస్ బుక్‌చేసుకున్న 30 నుంచి 45 నిముషాల్లో సిలిండర్‌ను అందిస్తామని ఐఓసీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అతి త్వరలో తత్కాల్ సేవతో సింగిల్ సిలిండర్ వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.