సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 57వ వార్షిక మహోత్సవాలు నేడు, బుధవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. నేటి ఉదయం స్థానిక ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ శ్రీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఇఓ దాసరి శ్రీరామ వరప్రసాద్, దేవాలయ సిబ్బంది ఆయనకు ఆలయ మర్యాదలు నిర్వహించారు. నేటి మధ్యాహ్నం శ్రీ అమ్మవారి నగర సంచార శోభాయ యాత్ర చక్కగా అలంకరించిన హంస మోటారు వాహనంపై మంగళ వాయిద్యాలతో , బాణాసంచా కాల్పులతో పురవీధుల గుండా రాజసంగా సాగింది.నేటి సాయంత్రం నుండి దేవాలయ ఆవరణలో సాంసృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి కరోనా నిబంధనల నేపథ్యంలో 10 రోజులు మాత్రమే ఉత్సవాలు నిర్వహిస్తుండటం గమనార్హం. నిన్న శ్రీ అమ్మవారి హుండీ లెక్కింపులో ( గత డిసెంబర్ 3వ తేదినుండి ఈ జనవరి 12వ తేదీ వరకు అమ్మవారికి 24,34,015/- రూపాయలు కానుకల ఆదాయం వచ్చింది. 17గ్రాముల, 400 మిల్లి గ్రాములు బంగారం, 105గ్రాముల వెండి కానుకలుగా భక్తులు సమర్పించారు.