తాజా వార్తలు   పశ్చిమ గోదావరి,గ్రామాలలోఇంటింటికి రేషన్‌ ప్రారంభం | బాలకృష్ణ ఫై, తొలిసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు | బెజవాడలోటీడీపీలో రచ్చ..ఎవడో గొట్టంగాడు చెబితే..బుద్ధా | ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్, జార్జ్ ఆకస్మిక దుర్మరణం | హిందూపురంలో బాలకృష్ణ రోడ్డు షో..జనం కావాలి.. | గంటా.. వైసిపికి ప్రతిపాదన పెట్టారు..ఎంపీ విజయసాయి | ప గోదావరి జిల్లాలో చిన తిరుమల హుండీ ఆదాయం.. | వాహనదారులకు శుభవార్త..ఆన్‌లైన్‌లో ఆర్టీఓ సేవలు | BPL క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ | భీమవరంలో బంద్..పార్టీలు.. ర్యాలీల కోలాహలం |

నా సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదు..డీజీపీ సవాంగ్

Updated: January 13, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై, దేవత విగ్రహాలపై  దాడులంటూ దుష్ప్రచారం జరుగుతోందని, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నా 35 ఏళ్ళ సర్వీసులో ఇటువంటి కుట్రలు చూడలేదని డీజీపీ గౌతం సవాంగ్‌ వ్యాఖ్యానించారు. నేడు,  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గతేడాదిలో పోలీస్ శాఖకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా కష్టపడ్డారు. కరోనాతో 109 మంది పోలీసులు మరణించారు.టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీస్ శాఖకు కేంద్ర స్థాయిలో 100కుపైగా అవార్డులు వచ్చాయి. గతంతో పోలిస్తే పోలీసులు చాల  సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఆలయాలకు సంబంధించి మొత్తం 44 కేసులు నమోదయ్యాయి. ఆలయాలపై దాడులు జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూలేనివిధంగా పోలీసులకు సంబంధించిన కులం, మతంపై ఆరోపణలు చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అంతర్వేది ఘటన దురదృష్టకరం. అంతర్వేది ఘటనపై కేంద్రానికి చెందిన  సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.ఆ తరువాత  రాష్ట్రంలోని 58, 871 హిందూ ఆలయాలను జియో ట్యాగింగ్ చేశాం. 13వేల ఆలయాల్లో 43వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.హిందూ దేవాలయాల విషయంలో దేశంలో ఎక్కడాలేని విధంగా భద్రతా చర్యలు చేపట్టాం అన్నారు. 
 
 
 
 

Related Stories