సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస శ్రీరామచంద్రుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ 300 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులకు తాజాగా షురూ చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ నేడు మంగళవారం సోషల్ మీడియా వెదికగా వెల్లడించారు. మోషన్ క్యాప్చర్ బృందంతో కలిసి డైరెక్టర్ ఓం రౌత్ తీసుకున్న ఫొటోను కూడా ప్రభాస్ షేర్ చేశారు.మోషన్ క్యాప్చర్ స్టార్టయ్యింది. ‘ఆదిపురుష్’ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు’అని ప్రభాస్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.ఓవైపు గ్రాఫిక్స్ సంబంధించి పనులు చేస్తూనే మరోవైపు రియల్ క్యారెక్టర్స్‌తో షూటింగ్ చేయనుంది.. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి రావణుడుగా సైఫ్ అలీ ఖాన్ మాత్రమే ఖరారయ్యారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 11న హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది.